NTR district: భర్త మర్మాంగాలను కోసిన రెండవ భార్య..!

NTR district: ఇంస్టాగ్రామ్ ఓ పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది.

NTR district: భర్త మర్మాంగాలను కోసిన రెండవ భార్య..!
X

NTR district: ఇంస్టాగ్రామ్ ఓ పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. తన మొదటి భార్య ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను కోసేసింది రెండవ భార్య. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని అయ్యప్ప నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు మొదటి పెళ్లి చేసుకుని బార్య, భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.

ఆ తరువాత ఐదేళ్ల క్రితం వరమ్మ అనే రెండవ మహిళను పెళ్లి చేసుకుని ముప్పాళ్ళలోనే నివాసం ఉంటున్నాడు. అయితే ఐదు నెలల క్రితం ముప్పాల నుండి నందిగామకి నివాసం మార్చారు ఆనంద్ బాబు, వరమ్మ. వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగుతున్న నేపథ్యంలో ఒక్క రాత్రి వీరి జీవితాలను మార్చేసింది. అందుకు ఇంస్టాగ్రామ్ కారణంగా మారింది. గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇంస్టాగ్రామ్ వీడియోలు చూస్తుండటంతో... తనను పెళ్లి చేసుకుని మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావని ఆనంద్ బాబుని ప్రశ్నించింది రెండో భార్య వరమ్మ.

దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. మాట మాట పెరిగి ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళింది. దీంతో భర్త ఆనంద్ బాబుపై బ్లేడ్ తో దాడి చేసిన వరమ్మ అతని మర్మాంగాలను కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు వైద్యులు.

Tags:
Next Story
Share it