Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమల భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
X

న్యూస్‌లైన్, డెస్క్: తిరుమల భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దాంతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండిపోయాయి. గత రెండు రోజులతో పోలిస్తే తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ కొద్ది మేర తగ్గింది. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

ఇక, మంగళవారం శ్రీవారిని 75,871 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. అదే సమయంలో 32,859 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారని, నిన్న ఒక్కరోజే స్వామి వారి హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సోమవారం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. నిన్న కాస్త తగ్గింది.

Tags:
Next Story
Share it