AP : నేటి నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్‌ శుభవార్త అందించింది. ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ లాంచనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి కొత్త

AP : నేటి నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ
X

AP : ఏపీ ప్రజలకు జగన్ సర్కార్‌ శుభవార్త అందించింది. ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ లాంచనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.

ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండేలా... ఉచిత వైద్యం ఎలా చేయించుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? సేవలు ఎలా పొందాలి? అనే వివరాలపై వాలంటీర్లతో అవగాహన కల్పించనున్నారు.

కార్డులో క్యూఆర్‌ కోడ్, లబ్ధిదారుని ఫోటో, ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ABHA ఐడీ ఉండనుంది. మొత్తంగా 4.52 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ సేవలు, ఆరోగ్య శ్రీ యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు అధికారులు.

Tags:
Next Story
Share it