చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ ఫీజు గంటకి ఎంతో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చంద్రబాబు అరెస్టు సంచలనం సృష్టిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై  ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.  

చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ ఫీజు గంటకి ఎంతో తెలుసా..?
X

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు సంచలనం సృష్టిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించడానికి ఎంతో మంది లాయర్లు ఎంతో ట్రై చేశారు అయినా చంద్రబాబు రిమాండ్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇదే తరుణంలో చంద్రబాబు కేసు వాదించే లాయర్ చాలా ఆసక్తిగా మారారు. మరి ఆయన ఎవరు. ఒక కేసు కు ఎంత ఫీజు తీసుకుంటారు అనే విషయాలు చూద్దాం..

చంద్రబాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించడానికి వచ్చిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్ర పేరు సంచలనంగా మారింది. క్రిమినల్ చట్టాలు, ప్రాథమిక హక్కులు, ఎన్నికల సవరణలు, వంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఎన్నో వాదనలు వినిపించారు ఈ లాయర్. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేశారు. అలాగే కేంద్ర యూనివర్సిటీలో క్రిమినాలజీలో ఎంఫీల్ చేశారు. అలాగే ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవలు అథారిటీ సభ్యునిగా, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా యూపీలోని ఏమిటి విశ్వవిద్యాలయంలో న్యాయపాఠాలు బోధిస్తారు.

ఇలా దేశంలోనే ఎంతో పేరుగాంచిన లాయర్ గా సిద్ధార్థ్ మూడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2010 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 2012 జూలై నుంచి 2014 మే వరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. అంతేకాకుండా తిహాల్కా కేసులో 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండేను లూత్రా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అంతేకాకుండా ఢిల్లీ హైకోర్టులో 2004 నుంచి 2007 వరకు భారత ప్రభుత్వం తరఫున అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. అలాగే ఫేస్బుక్ తరపున కూడా తన వాదనలు వినిపించిన అనుభవం లూత్రాకు ఉంది. ఇలా ఎంతో చరిత్ర కలిగిన లూత్రా ఒక కోర్టు కేసుకు హాజరు కావాలంటే ఐదు లక్షల నుంచి మొదలు 15 లక్షల వరకు తీసుకుంటారట. అంటే ఆయన ఒక గంటకు మినిమం లక్ష రూపాయల కంటే ఎక్కువ తీసుకుంటారని అర్థం.

Tags:
Next Story
Share it