AP DSC Notification : డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

పొరుగు రాష్ట్రం ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.

AP DSC Notification : డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల
X

AP DSC Notification : పొరుగు రాష్ట్రం ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేశారు .. 6,100 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు. 6,100 ఉపాధ్యాయుల పోస్టుల్లో 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 2,280 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి.. ఈ రోజు సచివాలయంలో మీడియాతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.. డీఎస్సీ -2024ను ప్రకటిస్తున్నామన్నారు.. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.. ఇక, రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభం అవుతుందన్నారు. మొత్తంగా ఏడు రకాల మేనేజ్మెంట్ పాఠశాల పరిధిలో 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Tags:
Next Story
Share it