Election Commision : టీచర్ల అద్వర్యం లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు టీచర్ల అద్వర్యం లో జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

Election Commision : టీచర్ల అద్వర్యం లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు
X

న్యూస్ లైన్ డెస్క్: మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి అని ఎలక్షన్ కమీషన్ నుండి కూడా క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ కమీషన్ అధికారులు పర్యటించారు. ఇక్కడి పరిస్థితులను, ఓటరు జాబితా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చంద్ర బాబు నాయుడు , పవన్ కళ్యాణ్ మరియు విజయ సాయి రెడ్డి వంటి వారు ఎలక్షన్ కమీషన్ అధికారులను కలిసి తమ ఎన్నికల సరళిలో లో ఉన్న ఇబ్బందులను, అభ్యంతరాలను వ్యక్త పర్చుకున్నారు. అందరి సలహాలను మరియు గతం లో జరిగిన పరిస్థితులను మొత్తం పరిగణలోకి తీసుకున్న అధికారులు ఎన్నికల విధుల్లోకి ఈసారి టీచర్లను దింపడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఎన్నికల విధులను నిర్వహించడానికి సచివాలయ సిబ్బందులు సరిపోరని, నిన్న సీఈసీ సమావేశం లో అధికారులు ప్రస్తావించారట.

సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ఎన్నికలను టీచర్ల అద్వర్యం లో చెయ్యడమే సరైన పద్దతి అనే నిర్ణయానికి వచ్చిన అధికారులు సీఈసీ ఆదేశాలతో DEO లకు ఆదేశాలు జారీ చేసారు. రేపటి లోపు ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నీ నియోజకవర్గాల్లో ఉండే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. టీచర్లను ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు గా ఈసీ నియమించింది. టీచర్ల అద్వర్యం లో ఎన్నికలు జరగడం వల్ల గత అవకతవకలు జరగకుండా, ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని ఈసీ అధికారులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:
Next Story
Share it