Election Commission : వాలంటీర్లపై ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.

ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు వాలంటీర్లను ఎలాంటి ఎన్నికల విధుల్లో పని చేయించడానికి వీలు లేదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Election Commission : వాలంటీర్లపై ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.
X

న్యూస్ లైన్, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు వాలంటీర్లను ఎలాంటి ఎన్నికల విధుల్లో పని చేయించడానికి వీలు లేదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి వాలంటీర్లను ఎన్నికల సంఘం నియమాలు విధిస్తూ ఒక లేఖని విడుదల చేసింది. ఈ లేఖలో వాలంటీర్లు ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బు పంపిణీ చేయరాదని, ఎన్నికల కోడ్ ఉన్నంతవరకు వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను స్వాదీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా చూస్తుంటే వాలంటీర్ల విషయం లో ఎన్నికల సంఘం చాలా కఠినంగా ఉన్నట్టుగా అర్థం అవుతుంది. టీడీపీ, జనసేన పార్టీలు మొదటి నుండి వాలంటీర్ వ్యవస్థపై భయాందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్రజల వ్యక్తిగత వివరాలు వాళ్ళతో ఉంటాయని, డబ్బుల పంపిణీ దగ్గర నుండి బూత్ మ్యానేజ్మెంట్ వరకు ప్రతీ ఒక్కటి వాలంటీర్లు చూసుకుంటారని, ఇలా చేస్తే ఎన్నికలు సజావుగా జరగవని ఆందోళన చేస్తూ ఉండేవారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళతో కలవడం తో వాలంటీర్ వ్యవస్థపై ఈసీ చేత ప్రత్యేక నిఘా పెట్టించినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:
Next Story
Share it