Janasena : జనసేన పార్టీలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు!

వైసీపీ పార్టీలో కొనసాగుతూ, ఆ పార్టీ కి వ్యతిరేకంగా పని చేసి అధిష్టానం చేత సస్పెండ్ కాబడిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు త్వరలోనే జనసేన పార్టీ లో చేరబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్నీ నరసాపురం పట్టణ 5వ వార్డు కౌన్సిలర్, సీనియర్ నాయకులు గుగ్గిలపు మురళీ తెలిపారు.

Janasena : జనసేన పార్టీలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు!
X

న్యూస్ లైన్, నరసాపురం : వైసీపీ పార్టీలో కొనసాగుతూ, ఆ పార్టీ కి వ్యతిరేకంగా పని చేసి అధిష్టానం చేత సస్పెండ్ కాబడిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు త్వరలోనే జనసేన పార్టీ లో చేరబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్నీ నరసాపురం పట్టణ 5వ వార్డు కౌన్సిలర్, సీనియర్ నాయకులు గుగ్గిలపు మురళీ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆయన పవన్ కళ్యాణ్ ని విశాఖపట్నం లో కలిసారని, పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఆయన పార్టీ లో చేరేందుకు నిర్ణయించుకున్నాడని, ఈ నెలాఖరున ఒక మంచి ముహూర్తం చూసుకొని మంగళగిరి ఆఫీస్ లో తన అనుచరులతో పార్టీ లో చేరబోతున్నారని, ఆయనతో పాటు ఆయన సోదరుడు జానకిరామ్, అలాగే ముఖ్య అనుచరులు వన్నెంరెడ్డి శ్రీనివాస్ జనసేనలో చేరుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈయనకి నర్సాపురం టికెట్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఆ స్థానం జనసేన పార్టీ నాయకుడు బొమ్మిడి నాయకర్ కి ఖరారు అయిపోయింది. బొమ్మిడి నాయకర్ జనసేన నుండి ఒంటరిగా పోటీ చేసిన గెలిచే సామర్థ్యం ఉన్న నాయకుడు. దానికి తోడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలం, కొత్తపల్లి సుబ్బారాయుడు బలం కూడా తోడు అయితే నర్సాపురం లో బొమ్మిడి నాయకర్ అఖండ మెజారిటీ తో గెలుస్తాడని అంటున్నారు.

Tags:
Next Story
Share it