Srikakulam : కూలిపొయ్యే స్థితిలో మాజీ ఎమ్మెల్యే ఇల్లు..పెన్షన్ డబ్బులతోనే జీవనం!

రాజకీయాన్ని నాయకులూ కేవలం ఒక వ్యాపారం గా మాత్రమే చూస్తున్న ఈ రోజుల్లో, జనాలకు నిస్వార్ధంగా సేవ చేస్తూ, ఒక్క పైసా అవినీతి చెయ్యకుండా రాజకీయం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే సుక్కా పగడాలమ్మా.

Srikakulam : కూలిపొయ్యే స్థితిలో మాజీ ఎమ్మెల్యే ఇల్లు..పెన్షన్ డబ్బులతోనే జీవనం!
X

న్యూస్ లైన్, శ్రీకాకుళం : రాజకీయాల్లోకి వచ్చి వేలకోట్ల రూపాయిలను సంపాదిస్తుంటారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ప్రజా సేవ చేసినా చెయ్యకపోయినా, ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఓటుకు నోటు ని జనాలకు విసిరి వేయడం. అలా విసిరిన డబ్బులకు పది రెట్లు ఎమ్మెల్యే అయిన వెంటనే సంపాదించుకోవడం, సర్వసాధారణం అయిపోయింది. రాజకీయాన్ని నాయకులూ కేవలం ఒక వ్యాపారం గా మాత్రమే చూస్తున్న ఈ రోజుల్లో, జనాలకు నిస్వార్ధంగా సేవ చేస్తూ, ఒక్క పైసా అవినీతి చెయ్యకుండా రాజకీయం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే సుక్కా పగడాలమ్మా.

ఈమె 1972 వ సంవత్సరం నుండి 1978 వ సంవత్సరం వరకు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం ఎమ్మెల్యే గా పనిచేసారు. ముక్తాపురం గ్రామానికి చెందిన ఈమె, తన నియోజకవర్గానికి స్వచ్ఛమైన పాలనని అందించి, ఆరోజుల్లో ఎంతో అభివృద్ధి చేసి చూపించారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకు రాజకీయాల నుండి తప్పుకున్న ఆమె, చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ప్రస్తుతం ఒక పాడుబడిన ఇంట్లో నివసిస్తూ, మాజీ ఎమ్మెల్యే గా 30 వేల రూపాయిల పెన్షన్ ని అందుకుంటూ, ఆ పెన్షన్ డబ్బులతోనే తన జీవనం కొనసాగిస్తుంది. అయితే కూతుర్ల పెళ్లిళ్ల కోసం అప్పులు చెయ్యడం తో పాటుగా, అనారోగ్య సమస్యల కారణంగా పెన్షన్ డబ్బులు అసలు సరిపోవడం లేదట. ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉందని, ప్రభుత్వం నుండి మరమ్మత్తుల నిమిత్తం ఆర్ధిక సహాయం కావాలని ఆమె కోరుతున్నారు. ఎమ్మెల్యే గా పనిచేసిన ఒక వ్యక్తి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉండడం చూసి నెటిజెన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Tags:
Next Story
Share it