Janasena : అడుగడుగునా అవమానాలు..రాజకీయాల నుండి తప్పుకో అంటున్న పవన్ ఫ్యాన్స్!

జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు పడుతున్న మానసిక క్షోభ మామూలుది కాదు. చంద్రబాబు నాయుడు ని సీఎం చెయ్యడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడా..?, వైసీపీ పార్టీ నాయకులూ ప్యాకేజి తీసుకున్నాడు అని అంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ చేస్తున్న చర్యలు చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది.

Janasena : అడుగడుగునా అవమానాలు..రాజకీయాల నుండి తప్పుకో అంటున్న పవన్ ఫ్యాన్స్!
X

న్యూస్ లైన్ డెస్క్: జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు పడుతున్న మానసిక క్షోభ మామూలుది కాదు. చంద్రబాబు నాయుడు ని సీఎం చెయ్యడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడా..?, వైసీపీ పార్టీ నాయకులూ ప్యాకేజి తీసుకున్నాడు అని అంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ చేస్తున్న చర్యలు చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది. 2019 ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ జనాల్లో ఉండడం, వాళ్ళ సమస్యల పట్ల పోరాడుతూ, వాళ్ళ తరుపున మాట్లాడుతూ ఉండడం వంటివి చూసి ఇతను రాజకీయాల్లో కచ్చితంగా నిలబడతాడు అని అభిమానులు ఆశపడ్డారు. అతన్ని బలంగా నమ్మి ఆయన వెంట నడవడానికి సిద్ధపడ్డారు అభిమానులు, కార్యకర్తలు. కష్టపడి సంపాదించిన డబ్బులతో వేలు, లక్షల రూపాయిల వరకు డొనేషన్స్ కూడా చేసారు. అభిమానులు ఆ స్థాయిలో నమ్మకాలు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం 20 ,30 సీట్ల కోసం తమ అభిమానాన్ని, ఆత్మవిశ్వాసంని చంద్రబాబు కి తాకట్టు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

నిజానికి వారాహి విజయ యాత్రతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్రాఫ్ ని అమాంతం పెంచేసాడు. అదే ఊపులో ఆ యాత్ర ని కొనసాగించి ఉంటే కచ్చితంగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ జగన్ కి ప్రత్యామ్నాయం అయ్యేవాడేమో. కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి, చంద్రబాబు తో మంతనాలు జరిపి, జైలు బయట పొట్టుని ప్రకటించాడు. ఆ ఒక్క సంఘటనతో వారాహి యాత్ర గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది. పొత్తు ప్రకటించిన తర్వాత మొక్కుబడిగా కృష్ణ జిల్లాలో రెండు మూడు ప్రాంతాలలో వారాహి యాత్ర పర్యటన జరిపి ఆపేసాడు. అప్పుడు ఆపిన వారాహి యాత్ర ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. కేవలం చంద్రబాబు, లోకేష్ సభలకు వెయిటేజీ ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ గత ఆరు నెలల నుండి అజ్ఞాతవాసం చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సరే ఎలాగో కలిసి వెళ్లబోతున్నాడు, కనీసం పొత్తులో 45 స్థానాలను అయినా డిమాండ్ చేసి దక్కించుకుంటాడని అభిమానులు ఆశించారు. కానీ చివరికి 25 సీట్లను కూడా దక్కించుకునేలా కనిపించడం లేదు. నిన్నటి నుండి ఎల్లో మీడియా లో జనసేన కి కేవలం 25 సీట్లు మాత్రమే ఇచ్చారు అంటూ ప్రచారం చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సహనం నశించిపోయింది. 25 స్థానాల కోసం ఇంత బిల్డప్స్ అవసరమా?, అంత తక్కువ స్థానాల్లో పోటీ చెయ్యడం కంటే జనసేన ని టీడీపీ లో విలీనం చేసి రాజకీయ సన్యాసం చెయ్యడం బెస్ట్ అని అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. పట్టుమని 30 స్థానాల్లో కూడా పోటీ చెయ్యలేని నువ్వు, ఏ మొహం పెట్టుకొని సీఎం జగన్ ని విమర్శించడానికి అర్హుడు అవుతావు?, కాపుల ఆత్మా గౌరవం ని నీ అన్నయ్య కాంగ్రెస్ కి తాకట్టు పెడితే, నువ్వు టీడీపీ కి తాకట్టు పెట్టావు. ఇక నిన్ను జీవితం లో నమ్మేది లేదంటూ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.

Tags:
Next Story
Share it