Nara Bhuvaneswari: సెక్యూరిటీ గురించే భయం.. నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం ఆయన సతీమణి భువనేశ్వరి, తనయ

Nara Bhuvaneswari: సెక్యూరిటీ గురించే భయం.. నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

న్యూస్‌లైన్, డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి కలిశారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఆయన ఉదయం నుండి రాత్రి వరకు నిత్యం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అన్నారు. తాను ఎప్పుడైనా అడిగితే.. తనకు ప్రజలే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని, ప్రజల హక్కుల కోసం పోరాడారని అన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును చూసి బయటకు వస్తుంటే నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్లు అనిపించిందని అన్నారు.

అలాంటి వ్యక్తిని ఆయన నిర్మించిన భవనంలోనే ఆయనను కట్టిపడేశారని, ఏమీ లేని కేసులో ఇరికించి చంద్రబాబును జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జైల్లోనూ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని, దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేది చంద్రబాబు కోరికని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, బాగున్నానని, భయపడవద్దని తనకు చెప్పినట్లు వెల్లడించారు. జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా కనిపించడం లేదని, చన్నీళ్లతో స్నానం చేయవలసి వస్తోందన్నారు. ఇది తమ కుటుంబానికి, పార్టీకి కష్ట సమయమని, ప్రజలంతా అండగా ఉండాలని తను కోరారు. ఆయన సెక్యూరిటీ గురించే తన భయమన్నారు నారా భువనేశ్వరి.

Tags:
Next Story
Share it