RAGHAVENDRA RAO : చంద్రబాబు అరెస్టు పై స్పందించిన సిని దర్శకుడు రాఘవేంద్ర రావు..

టీడీపీ అధినేత మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు పై దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు స్పందించారు. భారత ప్రజాస్వామ్యానికే ఇవాళ బ్లాక్ డే అని అన్నారు. ఏపీ చరిత్రలో ఇదో దుర్తినమని ఫైర్ అయ్యారు. అభివృద్ధి ప్రధాత సంక్షేమానికే మారుపేరైన చంద్రబాబు పై తప్పుడు కేసులు గర్హనీయమని అన్నారు. 

RAGHAVENDRA RAO : చంద్రబాబు అరెస్టు పై స్పందించిన సిని దర్శకుడు రాఘవేంద్ర రావు..
X

న్యూస్ లైన్ హైదరాబాద్ : టీడీపీ అధినేత మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు పై దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు స్పందించారు. భారత ప్రజాస్వామ్యానికే ఇవాళ బ్లాక్ డే అని అన్నారు. ఏపీ చరిత్రలో ఇదో దుర్తినమని ఫైర్ అయ్యారు. అభివృద్ధి ప్రధాత సంక్షేమానికే మారుపేరైన చంద్రబాబు పై తప్పుడు కేసులు గర్హనీయమని అన్నారు.

సీఎం జగన్ జైలు కెళ్లాడు కాబట్టే అందరినీ జైలుకు పంపడమే లక్ష్యంగా కంకణంగా పెట్టుకున్నారని రాఘవేంద్ర రావు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు జగన్ పతనానికి నాంది అని ఈ దుశ్చర్యతో తన గొయ్యి తనే తవ్వకున్నారని రాఘవేంద్ర రావు అన్నారు.

కాగా, చంద్రబాబు అరెస్టు పై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. చిలకలూరుపేటలో చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయిని అడ్డకున్నారు. తీవ్ర ఉద్రక్తతల నడుమ ఏపీ మాజీ సీఎంను పోలీసులు తరలిస్తున్నారు.

Tags:
Next Story
Share it