VISHAKAPATNAM : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఘోర అగ్రిప్రమాదం..

విశాఖపట్నంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగినట్టు తెలుస్తోంది.

VISHAKAPATNAM : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఘోర అగ్రిప్రమాదం..
X

న్యూస్ లైన్, విశాఖ : విశాఖపట్నంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగినట్టు తెలుస్తోంది. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించి హార్బర్‌లోని 60 బోట్లకు అంటుకున్నాయి. హార్బర్‌లో-A ఉన్న మత్స్యకారులు కంగారు పడి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మూడు వాహనాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కొన్ని బోట్లలో రూ. లక్షల విలువ చేసే మత్స్య సంపద ఉన్నట్టు సమాచారం. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. సుమారు రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రాత్రి పూట బోట్లలో మత్స్యకారులు ఎవరూ ఉండరని, అయితే ప్రమాద సమయంలో వాటిలో ఎవరైనా ఉండిపోయారా అనేది తెలియరావడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపడుతున్నారు.

Tags:
Next Story
Share it