Tenali : తెనాలిలో నడిరోడ్డుపై స్కూల్ బస్సు దగ్ధం!

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం లో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు దగ్ధం అయ్యింది.

Tenali : తెనాలిలో నడిరోడ్డుపై స్కూల్ బస్సు దగ్ధం!
X

న్యూస్ లైన్, తెనాలి: ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం లో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు దగ్ధం అయ్యింది. పూర్తి వివరాల్లోకి దుర్గి నుండి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సులో దాదాపుగా 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మంటలు చెలరేగడం ని పసిగట్టిన డ్రైవర్ వెంటనే పిల్లలందరినీ క్రిందకి దింపేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయట పాడడం తో పాఠశాల యాజమాన్యం ఊపిరి పీలుచుకున్నారు. అయితే మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఘోరం జరిగిపోయేది, ఇలాంటి సమయం లో చాకచక్యంగా వ్యవహరించినందుకు డ్రైవర్ పై సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే ఈ బస్సు దుర్గి లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినదని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it