Vishaka Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం..

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Vishaka Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం..
X

Vishaka Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్ లోని బీఎఫ్ 3లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని మాపక సిబ్బంది ఏడు ఫైర్ ఇంజన్ల తో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది.. ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదంలో కార్మికులను ఏమైనా గాయపడ్డారా అనే విషయాలు తెలియకపోవడంతో కార్మికులు బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Tags:
Next Story
Share it