YCP : వైసీపీ నుంచి బాలినేని ఔట్..క్లారిటీ ఇదే !

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచే పోటీచేస్తానని ప్రకటించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌

YCP :  వైసీపీ నుంచి బాలినేని ఔట్..క్లారిటీ ఇదే !
X

YCP : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచే పోటీచేస్తానని ప్రకటించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. విలువతోనే రాజకీయాలు చేస్తున్నా.. విలువల కోసమే మంత్రి పదవిని వదులకుని సీఎం వైఎస్‌ జగన్ వెంట నడిచానని స్పష్టం చేశారు.

సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానాల మార్పు అన్నారు. గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తల్లో.. పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నానన్నది అవాస్తవం అన్నారు. ఎంపీ మాగుంట విషయం సీఎం జగన్ తో మాట్లాడుతా..సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యం అన్నారు.

Tags:
Next Story
Share it