TTD: నూతన వధూవరులకు టీటీడీ గుడ్‌న్యూస్‌.. శ్రీవారి కళ్యాణానికి ఫ్రీ టికెట్లు

కొత్తగా పెళ్లి చేసుకున్న వారు పెళ్లి బట్టల్లోనే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అనంతరం జరిగే శ్రీవారి కళ్యాణ(Srivari Kalyanam ) లో పాల్గొంటారు.

TTD: నూతన వధూవరులకు టీటీడీ గుడ్‌న్యూస్‌.. శ్రీవారి కళ్యాణానికి ఫ్రీ టికెట్లు
X

TTD: కొత్తగా పెళ్లి చేసుకున్న వారు పెళ్లి బట్టల్లోనే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అనంతరం జరిగే శ్రీవారి కళ్యాణ(Srivari Kalyanam ) లో పాల్గొంటారు. ఇలాంటి జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక శుభవార్త చెప్పింది. నూతన వధూవరులు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. కొత్త జంటలు తిరుమలకు వచ్చి శ్రీవారి కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకునే వారికి టీటీడీ(TTD) ప్రత్యేక అవకాశం అందించనుంది. జీవితంలో వచ్చే అనేక కష్ట, నష్టాలనుంచి గట్టెక్కించమని భక్తులు నిత్యం ఏడుకొండల వాడిని వేడుకుంటారు. అలాగే కొత్త జంటలు కూడా తమ దాంపత్య జీవితం సాఫీగా సాగాలని శ్రీవారి కల్యాణంలో పాల్గొంటారు.

మరి కొందరు పెళ్లి శుభకార్యం నిర్వఘ్నంగా సాగాలని, అన్ని అనుకున్నట్లు జరిగితే స్వామి వారి కళ్యాణ సేవలో పాల్గొంటామని భక్తులు మొక్కుకుంటారు. అలాగే వారి కోరిక తీరిన తర్వాత కళ్యాణ సేవలో పాల్గొనేందుకు తిరుమలకు వస్తుంటారు. చాలా మందికి టికెట్‌ ఎలా పొందాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమౌతుంటారు. తాజాగా టీటీడీ ప్రకటనలో నూతన వధూవరులకు రోజుకు 20 టికెట్లను కేటాయించింది. ఈ టికెట్‌ రూ.1000. ఇందులో కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం కలిపే ఉంటాయి. ఈ టికెట్‌ పొందాలంటే పెళ్లైన జంటలు ముందుగా సీఆర్వో ఆఫీసులో ఆర్జిత సేవా లక్కీ డిప్‌ కౌంటర్‌కి వెళ్ళీ.. పెళ్లి నాటి ఫోటో, వెడ్డింగ్‌ కార్డు(wedding card) సమర్పించాలి. అయితే పెళ్ళి అయిన వారం లోపే ఈ టికెట్(ticket) పొందడానికి అర్హత ఉంటుంది. వీటితో పాటు ఆధార్‌ కార్డులు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌ ద్వారా కొత్త జంటలు నేరుగా కళ్యాణోత్సవ టికెట్ పొందవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:
Next Story
Share it