Janasena : జనసేన పార్టీ లోకి గంటా శ్రీనివాసరావు..?

తెలుగు దేశం పార్టీ లో ముఖ్య నాయకుడిగా ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతూ ఆ పార్టీ కి ఉత్తరాంధ్ర లో తిరుగులేని బలం చేకూరడానికి నిరంతరం కృషి చేస్తూ వచ్చిన గంటా శ్రీనివాస రావు కి ఇప్పుడు టికెట్ దొరకడం కష్టం అయ్యింది.

Janasena : జనసేన పార్టీ లోకి గంటా శ్రీనివాసరావు..?
X

న్యూస్ లైన్, వైజాగ్ : తెలుగు దేశం పార్టీ లో ముఖ్య నాయకుడిగా ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతూ ఆ పార్టీ కి ఉత్తరాంధ్ర లో తిరుగులేని బలం చేకూరడానికి నిరంతరం కృషి చేస్తూ వచ్చిన గంటా శ్రీనివాస రావు కి ఇప్పుడు టికెట్ దొరకడం కష్టం అయ్యింది. చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాసరావు ని చీపురుపల్లి స్థానం నుండి పోటీ చేయాల్సిందిగా కోరారు. కానీ ఆ స్థానం లో వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చెయ్యనున్నారు. కాబట్టి ఆ స్థానం నుండి పోటీ చేస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గెలుపు అసాధ్యం అని, ఈ ఎన్నికలలో ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నందున ఆ స్థానం నుండి పోటీ చేయలేనని గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడుకి చెప్పారట.

కానీ చంద్రబాబు నాయుడు చీపురుపల్లి నుండి చేస్తేనే నీకు టికెట్ ఉంటుందని, లేకపోతే టికెట్ లేనట్టే అని చెప్పడంతో గంటా శ్రీనివాస రావు ఆలోచనలో పడ్డారు. నిన్న ఉత్తరాంధ్ర లో తన అనుచరులతో చర్చలు జరిపిన గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ భీమిలి టికెట్ ఇప్పిస్తే ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ లో వెంటనే చేరిపోతానని పవన్ కళ్యాణ్ కి చెప్పినట్టు తెలుస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ భీమిలి టికెట్ ఇప్పించలేకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా భీమిలి లో పోటీ చేసి గెలవాలని చూస్తున్నారట గంటా శ్రీనివాసరావు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Tags:
Next Story
Share it