Cm Jagan : ఏపీ మహిళల అకౌంట్స్ లోకి 12 వేలు జమ చేసిన జగన్ సర్కార్!

సంక్షేమ పథకాల విషయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కి సాటి ఎవ్వరూ రాలేరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Cm Jagan : ఏపీ మహిళల అకౌంట్స్ లోకి 12 వేలు జమ చేసిన జగన్ సర్కార్!
X

న్యూస్ లైన్, అమరావతి : సంక్షేమ పథకాల విషయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కి సాటి ఎవ్వరూ రాలేరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. పక్క రాష్ట్రం తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎంత ఇబ్బంది పడుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం రెండు నెలల్లోనే ఎంతో మంది రైతులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ సీఎం జగన్ పరిపాలనలో ఇలాంటి సంఘటనలు జరగడం మనం చాలా తక్కువగా చూసి ఉంటాం. ఎందుకంటే జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వచ్చాడు. ఆంధ్ర ప్రదేశ్ లో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, మధ్యలో కరోనా మహమ్మారి కారణంగా ఎంతో ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా ఆయన సంక్షేమ పథకాలను ఆపలేదు. ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదంతా పక్కన పెడితే ఇటీవల కాలంలో వైఎస్సార్ చేయుట, వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే పథకాల ద్వారా మహిళలకు అకౌంట్స్ లో డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ని విడుదల చేసారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పధకం ద్వారా అర్హులైన మహిళలకు డబ్బులు విడుదల చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధం అవుతుంది. ఈనెల 24 వ తారీఖున కర్నూలు లో జరగబోయే సభలో జగన్ బటన్ నొక్కి ఈ పథకం ని ప్రారంభించబోతున్నాడు. ఈ పథకం పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.

45 నుండి 60 ఏళ్ళ వయస్సు లోపు ఉన్న మహిళలకు ఈ పథకం ద్వారా 15 వేల రూపాయిలు వారి అకౌంట్ లో జమ కానున్నాయి. ఈ పథకం కి కావాల్సిన అర్హత ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళల నెలసరి ఆదాయం 10 వేలు, లేదా 12 వేల రూపాయిలు అయ్యి ఉండాలి. అలాగే కుటుంబానికి మొత్తం భూములు 3 ఎకరాల చిత్తడి నేల, లేదా పది ఎకరాల పొడి భూమి కానీ, తడి భూమి కానీ ఉండాలి. అంతే కాకుండా 4 వీలర్ వాహనాలు ఇంట్లో ఉండకూడదు. పట్టాన ప్రాంతాలలో ఉండే ఆస్తి లేదా, మున్సిపాలిటీలో 750 చదరపు అడుగుల కన్న భూమి ఉండకూడ. ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఏపీ సేవా ద్వారా తీసుకున్న ఆదాయ, కుల దుర్వీకరణ పాత్రలను ఇవ్వాలి. ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్,రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబ సభ్యులలో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్ దారులు అయ్యి ఉండకూడదు.

Tags:
Next Story
Share it