TTD : తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త..రేపు టికెట్లు విడుదల !

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త, రేపు ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు

TTD : తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త..రేపు టికెట్లు విడుదల !
X

TTD : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త, రేపు ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. అలాగే.. రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.

ఎల్లుండి 300 రుపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఆగస్ట్‌,సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లు విడుదల చేస్తారు. అక్టోబర్ నెలకు సంబంధించిన రోజుకు 15 వేల చోప్పున టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

Tags:
Next Story
Share it