NTR: రికార్డు స్థాయిలో విక్రయమవుతున్న ఎన్టీఆర్ స్మారక నాణెలు

నందమూరి తారకరామారావు (NTR) శతజయంతి ఉత్సవాల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రూ.100 నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

NTR: రికార్డు స్థాయిలో విక్రయమవుతున్న ఎన్టీఆర్ స్మారక నాణెలు
X

NTR: నందమూరి తారకరామారావు (NTR) శతజయంతి ఉత్సవాల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రూ.100 నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆగస్ట్ 28న ఢిల్లీలో ఈ నాణేన్ని నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. అదే నెల 29వ తారీఖు నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటుగా అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ఉంటుంది.

హైదరాబాద్ (Hyderabad) మింట్ కాంపౌండ్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారైంది. మార్కెట్లోకి విడుదలైన రెండు నెలల్లోనే 25 వేల నాణేలు అమ్ముడయ్యాయి. దేశంలోనే ఇది సరికొత్త రికార్డని మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు(VNR Naidu) వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ (TD Janardhan) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీఎన్ఆర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత మహాత్మా గాంధీ వంటి పలువరు మహానీయుల నాణేలను కేంద్రం విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు స్మారక నాణేల్లో 12వేల నాణేలు రికార్డని.. ఆ రికార్డును ఎన్‌టీఆర్‌ స్మారక నాణెం

(Commemorative coin) బ్రేక్‌ చేసిందన్నారు.

కమిటీ చైర్మన్‌ జనార్దన్‌ మాట్లాడుతూ అన్ని ఎన్టీఆర్‌ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ శతాబ్ది సంవత్సరంలో కమిటీ, ఎన్టీఆర్‌ శాసనసభ ప్రసంగాలు, చారిత్రాక ప్రసంగాలు, శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చేయగా.. అందులో ఎన్టీఆర్‌ స్మారక నాణెం మొదటి వరుసలో ఉండడం గర్వకారణమన్నారు.

Tags:
Next Story
Share it