Group 2 : గ్రూప్ 2 పోస్టుల దరఖాస్తు తేదీ గడువుని పొడిగించిన ఏపీ ప్రభుత్వం!

గ్రూప్ 2 పరీక్షల ఫీజు దరఖాస్తు తేదీని పొడిగించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 7 వ తారీఖున ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

Group 2 : గ్రూప్ 2 పోస్టుల దరఖాస్తు తేదీ గడువుని పొడిగించిన ఏపీ ప్రభుత్వం!
X

న్యూస్ లైన్, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 7 వ తారీఖున ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. నిన్నటితో దరఖాస్తు గడువు తేదీ ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ గడువు తేదీని జనవరి 17 వ తారీఖు వరకు పొడిగిస్తున్నాం అంటూ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపాడు. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదీ లో ఎలాంటి మార్పు లేదని, వచ్చే నెల అనగా ఫిబ్రవరి 25 వ తారీఖున యదావిధిగా జరుగుతాయని ప్రదీప్ స్పష్టం చేసాడు. దరఖాస్తులను అప్లై చేసుకోవడానికి మరియు ఇతర వివరాల తెలుసుకోవడం కోసం https://psc.ap.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చని పేర్కొన్నాడు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు దాదాపుగా 899 పోస్టులను ఈ గ్రూప్ 2 పరీక్షలు ద్వారా భర్తీ చేయనుంది ప్రభుత్వం.

Tags:
Next Story
Share it