Group 2 : ఎల్లుండి 'గ్రూప్ 2 ' పరీక్షల హాల్ టికెట్స్ విడుదల!

ఫిబ్రవరి 25 వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ లో జరగబొయ్యే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఈ నెల 14 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు APPSC అధికారిక ప్రకటన చేసింది.

Group 2 : ఎల్లుండి గ్రూప్ 2  పరీక్షల హాల్ టికెట్స్ విడుదల!
X

న్యూస్ లైన్, అమరావతి : ఫిబ్రవరి 25 వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ లో జరగబొయ్యే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఈ నెల 14 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు APPSC అధికారిక ప్రకటన చేసింది. ప్రభుత్వ శాఖల్లో 897 పోస్టులను భర్తీ చెయ్యడానికి ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 25 వ తారీఖున ఉదయం 10:30 నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ జరగబోతుందని సమాచారం. ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్రం లోని 24 జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5 అంశాల నుండి 150 మార్కులకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, ఎట్టి పరిస్థితిలో ఆలస్యం అవ్వకూడదని ఈ సందర్భంగా అధికారులు చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it