Galla Jayadev : రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్ బై!

ప్రత్యక్ష రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టుగా గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

Galla Jayadev : రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్ బై!
X

న్యూస్ లైన్, గుంటూరు : ప్రత్యక్ష రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టుగా గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 50 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న గల్లా కుటుంబం నుండి వచ్చిన గల్లా జయదేవ్ గుంటూరు నుండి రెండు సార్లు ఎంపీ గా పోటీ చేసి గెలుపొందాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తాను రాజకీయాల్లో ఇమడలేనని, ఇప్పుడు నా వ్యాపారాలను చూసుకోవడమే ప్రధమ కర్తవ్యం అని గల్లా జయ్ దేవ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. వ్యాపారం ని పార్ట్ టైం గా చూడొచ్చు కానీ, రాజకీయాలను పార్ట్ టైం గా చూడలేనని, అందుకే రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టుగా ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో ఒకవేళ నా అవసరం వస్తే, కచ్చితంగా మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని, ప్రస్తుతానికి నా వ్యాపారాలను చూసుకుంటూ , కుటుంబం తో గడపడానికే నా సమయం ని వెచ్చిస్తానని ఆయన వ్యాఖ్యానించాడు. బంధు మిత్రులు, శ్రేయోభిలాషులతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరమే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా గల్లా జయదేవ్ చెప్పుకొచ్చాడు.

Tags:
Next Story
Share it