Schools reopen : రేపే స్కూళ్లు రీ-ఓపెన్... వారం రోజులు ఒంటిపూటే...!

ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూళ్ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి వారం రోజుల పాటు అంటే జూన్ 17వ తేదీ వరకు స్కూళ్లను ఒంటిపూటే నడిపించాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30గంటల నుంచి 11.30గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

Schools reopen : రేపే స్కూళ్లు రీ-ఓపెన్... వారం రోజులు ఒంటిపూటే...!
X

న్యూస్ లైన్, ఆంధ్రప్రదేశ్: సమ్మర్ హాలీడేస్ ఇవాళ్టితో ముగుస్తున్నాయి. రేపట్నుంచి స్కూళ్లు రీ ఓపెన్ అవుతున్నాయి. అయితే హాలీడేస్ ముగిసినా.. ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూళ్ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి వారం రోజుల పాటు అంటే జూన్ 17వ తేదీ వరకు స్కూళ్లను ఒంటిపూటే నడిపించాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30గంటల నుంచి 11.30గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

స్కూల్ ప్రారంభమైన గంట తర్వాత అంటే ఉదయం 8.30గంటల నుంచి 9గంటల మధ్యలో విద్యార్ధులకు రాగి జావ అందిస్తారు. ఉదయం 11.30గంటల నుంచి 12గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:
Next Story
Share it