Janasena : నేను చనిపోయేవరకు పవన్ కళ్యాణ్ తో ఇలాగే ప్రవర్తిస్తా - హరి రామ జోగయ్య

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి తెలుగు దేశం పార్టీ 24 స్థానాలు ఇవ్వడంపై ఆయన అభిమానుల్లో మద్దతుదారుల్లో ఇంకా నిరాశ నిస్పృహలు పోలేదు. 40 స్థానాలకు పైగా జనసేన పార్టీ కి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. అయినప్పటికీ కూడా 24 స్థానాలు తీసుకోవడం అనేది దురదృష్టకరం అని పవన్ కళ్యాణ్ అభిమానుల ఆవేదన.

Janasena : నేను చనిపోయేవరకు పవన్ కళ్యాణ్ తో ఇలాగే ప్రవర్తిస్తా - హరి రామ జోగయ్య
X

న్యూస్ లైన్, అమరావతి : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి తెలుగు దేశం పార్టీ 24 స్థానాలు ఇవ్వడంపై ఆయన అభిమానుల్లో మద్దతుదారుల్లో ఇంకా నిరాశ నిస్పృహలు పోలేదు. 40 స్థానాలకు పైగా జనసేన పార్టీ కి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. అయినప్పటికీ కూడా 24 స్థానాలు తీసుకోవడం అనేది దురదృష్టకరం అని పవన్ కళ్యాణ్ అభిమానుల ఆవేదన. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ్డ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా నేడు హరిరామ జోగయ్య రాసిన ఒక ఉత్తరం బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ 'జనసేన బాగుకోసం,మా కాపుల ప్రయోజనాలు కాపాడేందుకు నేను ఇస్తున్న సలహాలు మీకు నచ్చినట్లు లేవు. చంద్రబాబే సిఎం , వేరేవాళ్లకు అవకాశమే లేదు అని లోకేష్ చేసిన ప్రకటనను ఖండించినందుకు నేను వైసిపి కోవర్ట్ నా ?, జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు వుంటే 24 సీట్లు ఇచ్చారు.ఈ ఘోరాన్ని ప్రశ్నించినందుకు నేను వైసిపి కోవర్ట్ నా.జనసేన మద్దతు లేకుండా టిడిపి గెలవడం అసాధ్యం కాబట్టే చంద్రబాబు మీతో జతకట్టాడు. ఎన్నికలు అయ్యాక చంద్రబాబు మీకు ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం లేదు. కూటమి గెలిస్తే చంద్రబాబు జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి లోకేష్ ను ముఖ్యమంత్రిని చేస్తారనే భయం జనసైనికుల్లో వుంది. అందుకే పవన్ కళ్యాణ్ కు గౌరవం దక్కాలని నేను డిమాండ్ చేయడం నేరమా ?, మిమ్మల్ని ప్యాకేజి స్టార్ అంటూ వెక్కిరిస్తుంటే ఆ ప్రచారాన్ని చంద్రబాబు, లోకేష్ ఎందుకు ఖండించరు?. మిమ్మల్ని వాడుకోవాలని టీడీపీ చూస్తోంది. ఆ కుట్ర మీరు గుర్తించడం లేదు. మీకు నచ్చినా లేకున్నా మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి,నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే వుంటుంది' అంటూ జోగయ్య లేఖలో తన ఆవేదనను పంచుకున్నారు.

Tags:
Next Story
Share it