Chandrababu Naidu: చంద్రబాబు పిటిషన్ల విచారణ రేపటికి వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ఈ పిటిషన్లను వింటామని తెలిపారు. మరో 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసింది. బెయిల్ పిటిషన్ పై చంద్

Chandrababu Naidu: చంద్రబాబు పిటిషన్ల విచారణ రేపటికి వాయిదా
X

న్యూస్‌లైన్, డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ఈ పిటిషన్లను వింటామని తెలిపారు. మరో 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసింది. బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. ఇరు పక్షాల మధ్య వాదనలు హోరాహోరిగా సాగాయి. తొలుత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు దర్యాఫ్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని పొన్నవోలు కోర్టును కోరారు.

ఈ కేసుకు సంబంధించి రూ.371 కోట్ల దుర్వినియోగం జరిగిందని, బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచామని, పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందన్నారు. కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవమన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం విచారణను రేపటికి (గురువారం) వాయిదా వేసింది.

Tags:
Next Story
Share it