Michaung Cyclone : ఏపీలో కుండపోత వర్షాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లో మిచాంగ్ తుపాను ప్రభావం పెరుగుతోంది. గంటగంటకూ వర్షం జోరుగా ఊపందుకుంటుంది.

Michaung Cyclone : ఏపీలో కుండపోత వర్షాలు..  హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన సర్కార్
X

Michaung Cyclone : ఆంధ్రప్రదేశ్‌లో మిచాంగ్ తుపాను ప్రభావం పెరుగుతోంది. గంటగంటకూ వర్షం జోరుగా ఊపందుకుంటుంది. భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాంతాలు ఇప్పటికే జలమయమవుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. మిచాంగ్ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు 250 కి.మీ, మచిలీపట్నానికి 380 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై, తుపాను తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిచాంగ్ తుపాను మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుంది. ఈ సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది.

మిచాంగ్ తుపాను ముప్పుతో కృష్ణా జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కంట్రోల్ రూం నంబర్లు 08672 252572, 08672 252000 ప్రకటించారు. మరోవైపు తుపాను నేపథ్యంలో కృష్ణాలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. తీర ప్రాంత మండలాల్లో పలు చర్యలు చేపట్టారు. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు, వరదల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Tags:
Next Story
Share it