Nellore : ATM మీదకు దూసుకెళ్లిన లారీ..నెల్లూరు జిల్లాలో ఘోరప్రమాదం!

నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలో ఘోరప్రమాదం జరిగింది. దొడ్ల డైరీ పాల ట్యాంకర్ వేగంగా వస్తూ అదుపు ATM వైపు దూసుకుపోయింది.

Nellore : ATM మీదకు దూసుకెళ్లిన లారీ..నెల్లూరు జిల్లాలో ఘోరప్రమాదం!
X

న్యూస్ లైన్, నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలో ఘోరప్రమాదం జరిగింది. దొడ్ల డైరీ పాల ట్యాంకర్ వేగంగా వస్తూ అదుపు ATM వైపు దూసుకుపోయింది. డ్రైవర్ చిన్న గాయాలతో బయటపడ్డాడు కానీ ఏటీఎం మాత్రం పూర్తిగా ద్వంసం అయ్యింది. కోవూరు లోని మైథిలి థియేటర్ సెంటర్ లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ సెంటర్ లో అలాంటి యాక్సిడెంట్లు ఎప్పుడూ చూడలేదట కోవూరు ప్రజలు. ఎందుకంటే అంత రద్దీ ఉండే సెంటర్ అది. ఏటీఎం లో దాదాపుగా 8 లక్షల రూపాయలకు పైగా క్యాష్ ఉందట. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ప్రమాద స్థలం కి వచ్చి పరిశీలించాడు. డ్రైవర్ పై కేసు ని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగే సమయం లో ATM ఎవ్వరూ లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఘోరం జరిగేదని ఎస్ ఐ రంగనాథ్ గౌడ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Tags:
Next Story
Share it