Janasena Vs Tdp : టీడీపీ - జనసేన పొత్తులో మంటలు రేపుతున్న స్థానాలు ఇవే!

టీడీపీ -జనసేన పొత్తులో కొలిక్కి రాని అసెంబ్లీ స్థానాల జాబితా ఇదే!.

Janasena Vs Tdp : టీడీపీ - జనసేన పొత్తులో మంటలు రేపుతున్న స్థానాలు ఇవే!
X

న్యూస్ లైన్ , అమరావతి : టీడీపీ - జనసేన పొత్తు ఏర్పడి చాలా కాలం అయ్యింది. గత ఏడాది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యినప్పుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలులో ఆయన్ని కలిసి ఎమోషనల్ గా పొత్తుని ప్రకటించినప్పుడు టీడీపీ, జనసేన క్యాడర్ లో జోష్ మామూలు రేంజ్ లో రాలేదు. ఈ ఎన్నికలలో తిరుగులేదు అని అనుకున్నారు. కానీ సీట్ల పంపకం వద్ద క్షేత్ర స్థాయిలో ఇరువురి పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న రచ్చ ని చూస్తుంటే ఇప్పట్లో ఈ సీట్ల పంపకం వ్యవహారం సర్దుకునేట్టుగా అనిపించడం లేదు. సమస్యపూరితమైన నియోజకవర్గాల లిస్ట్ రోజురోజుకి పెరుగుతూ పోతుంది. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు పై కార్యకర్తలు మరియు నాయకుల ఒత్తిడి తారాస్థాయికి చేరుకుంది. ఇటీవలే ఒత్తిడిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి మండపేట, అరకు నియోజకవర్గాలను ప్రకటించాడు. దీనికి మనసు నొచ్చుకున్న పవన్ కళ్యాణ్ నాకు కూడా ఒత్తిడి ఉంది, అందుకే పోటీ రాజానగరం, రాజోలు స్థానాలను ప్రకటించేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

ఇలా అధినేతల మధ్యనే సమన్వయం లేకుంటే ఇక ఇరు పార్టీల క్యాడర్స్ లో సమన్వయం ఎలా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి పొత్తులో సమస్యపూరితమైన ప్రాంతాల జాబితా ని ఒకసారి పరిశీలిస్తే పిఠాపురం, నెల్లూరు, తెనాలి, తిరుపతి,ప్రొద్దుటూరు వంటి స్థానాలు ఉన్నాయి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబోయే నియోజకవర్గం ఏమిటో క్లారిటీ లేదు. జనసేన పీఏసీసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి ఇంకా తెనాలి టికెట్ ఖరారు కాలేదు. ఈ స్థానం ని వదులుకోవడానికి నేను సిద్ధం గా లేను, సీట్ ఖరారు కాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేరుగా మీడియా ముందే ప్రకటన చేసాడు. గత ఎన్నికలలో ఆయనకి ఈ స్థానం లో 76846 ఓట్లు నమోదు అవ్వగా, నాదెండ్ల మనోహర్ కి కేవలం 29905 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమండ్ లోను న్యాయం ఉంది.

ఇక టీడీపీ - జనసేన పొత్తులో సమస్యపూరితంగా ఉన్న మరో నియోజకవర్గం పిఠాపురం. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి టికెట్ దాదాపుగా ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. ఇక్కడ జనసేన కి గత ఎన్నికలలో 28 వేల ఓట్లు రాగ, టీడీపీ అభ్యర్థి ఎస్ వీ ఎస్ ఎన్ వర్మ కి 68 వేల ఓట్లు వచ్చాయి. కాబట్టి ఆ స్థానం నుండి నేనే పోటీ చేస్తాను అంటూ టీడీపీ అభ్యర్థి వర్మ మొండికేస్తున్నాడట. కానీ సర్వేల ప్రకారం ఈ స్థానం లో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే భారీ మెజారిటీ తో గెలుస్తారని చెప్తుంది, కానీ టీడీపీ అభ్యర్థి వర్మ ఈ స్థానం ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక నెల్లూరు జిల్లాలో కచ్చితంగా రెండు స్థానాలు కావాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ గెలవగలిగే స్థానాలు నెల్లూరు సిటీ/రూరల్, కావలి. సిటీ లో నారాయణ కి సీట్ ఖరారు అయ్యింది, రూరల్ కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. పొత్తులో భాగంగా నెల్లూరు రూరల్ స్థానం ని టీడీపీ జనసేన కి కేటాయించినట్టుగా చెప్తున్నారు. దీనిపై కోటంరెడ్డి వర్గం ఫుల్ ఫైర్ మీద ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవి సర్దుమణిగి ,ఎన్నికలలో పోటీ చెయ్యడమే పెద్ద సవాల్ అనిపిస్తుంది, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారో చూడాలి.

Tags:
Next Story
Share it