Chandrababu Naidu: ‘ఒకటి రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు’.. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో నన్న అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. బుధవారం రాయదుర్గం పల్లె ప్రగతి కోసం ప్రజా వేదిక ఆయన మాట్లాడారు.

Chandrababu Naidu: ‘ఒకటి రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు’.. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు
X

న్యూస్‌లైన్, డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో నన్న అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. బుధవారం రాయదుర్గం పల్లె ప్రగతి కోసం ప్రజా వేదిక ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇలాంటి ఆరాచక పాలన కోసం ఇంటికి ఒకరు ముందుకు రావాలని కోరారు. ఒకటి రెండు రోజుల్లో తనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.. తనపై దాడులు చేస్తారని అన్నారు. తప్పుడు కేసులు కూడా పెడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు బయటకు రాకుండా బయటకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

ఎక్కువగా మాట్లాడితే రౌడీలతో దాడులు చేయిస్తున్నారని, పుంగనూరు, తంబాలపల్లిలో 400 మంది పై కేసులు పెట్టారని అన్నారు. పుంగనూరు అలర్లలో తాను చెప్పానని చల్లాబాబును సంతకం పెట్టమన్నారని చెప్పారు. కుప్పంకు వెళ్లి తన టిక్కెట్ తనే ప్రకటించుకోవాలా.? అని ప్రశ్నించారు. తమకు అన్యాయం జరిగిందని ఏ ఉద్యోగం సంఘం అయినా బయటకు వచ్చి పోరాడుతోందా అని ప్రశ్నించారు. మన వేలితో మన కళ్లను పొడిచే పరిస్థితి వచ్చిందని ఆవేధన వ్యక్తం చేశారు. యువగళంను ప్రశాంతంగా జరుగుతోందని, అయినా దాడులు చేసి కేసులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.

Tags:
Next Story
Share it