TDP : ఏపీలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ..దూరమవుతున్న కీలక నేతలు

ఏ ముహూర్తం లో చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారో తెలియదు కానీ, అప్పటి నుండి తెలుగు దేశం పార్టీ కి అనేక విషయాల్లో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.

TDP : ఏపీలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ..దూరమవుతున్న కీలక నేతలు
X

న్యూస్ లైన్, అమరావతి: ఏ ముహూర్తం లో చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారో తెలియదు కానీ, అప్పటి నుండి తెలుగు దేశం పార్టీ కి అనేక విషయాల్లో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, పార్టీ కోసం ఎంతో కస్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు విస్మరించడం, వారు పార్టీ ని వీడి వెళ్లిపోవడం వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు పెట్టుకున్న ఈ పొత్తు మూడు పార్టీలలో కూడా ఆనందం నింపలేదు. జనసేన పార్టీ కార్యకర్తల్లో , క్యాడర్ లో బలానికి తగ్గ సీట్లు చంద్రబాబు ఇవ్వలేదని, పవన్ కళ్యాణ్ ని వెన్నుపోటు పొడిచారనే భావనలో ఉంది. మరోపక్క బీజేపీ కి ఆరు ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడం పై తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అలాగే బీజేపీ పార్టీ కి కూడా చంద్రబాబు తో కలిసి పని చెయ్యడం ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ బలవంతం వల్లనే బీజేపీ టీడీపీ తో పొత్తుకు ఒప్పుకుంది.

ఇలా పూర్తిగా అయిష్టాలతో పొత్తు పెట్టుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఎన్నికలలో పోటీ చేయకముందే డిజాస్టర్ ఫలితాలను చూసినట్టు ఉందని మద్దతుదారుల్లో కూడా కలుగుతున్న భావన. ఇవన్నీ పక్కన పెడితే నేడు తెలుగు దేశం పార్టీ చివరి జాబితా ని విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ కోసం మొదటి నుండి కస్టపడి పని చేసిన వారికి సీట్ ఇవ్వకుండా, కేవలం డబ్బు ఆశ చూపించిన వారికే చంద్రబాబు సీట్లను కేటాయించారు. ఉదాహరణకి అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కి పార్టీ టికెట్ ఇవ్వలేదు. గడిచిన 5 ప్రభాకర్ చౌదరి టీడీపీ బలోపేతం కోసం చేసిన కృషి వర్ణనాతీతం. అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వకుండా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి సీటు కేటాయించడం పై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేసారు. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు దహనం చేసి, ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకటి రెండు చోట్ల మాత్రమే కాదు, అనేక ప్రాంతాలలో ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. కొంతమంది టికెట్ దక్కకపోవడం తో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి పార్టీ తో కలిసి ప్రయాణం చెయ్యడం కంటే, రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం అని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:
Next Story
Share it