Roja : రోజాకు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ సపోర్ట్ ..

మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మంత్రి రోజా స్నేహితురాలు ..హీరోయిన్ రమ్యకృష్ణ స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడినందుకు బండారు సత్యనారాయణని క్షమించకూడదన్నారు. మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని.. అలాం

Roja : రోజాకు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ సపోర్ట్ ..
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏపీ రాజకీయాలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన నాయకులు కూడా చాలా దారుణంగా నోరు జారుతున్నారు. మంత్రి రోజాపై టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారం రేపుతుంది. మంత్రి రోజాకు మద్దతు పెరుగుతూ వస్తోంది. అటు రాజకీయ నాయకుల నుంచే కాదు.. ఇటు సినీ ప్రముఖులు కూడా రోజాకు అండగా నిలబడుతున్నారు.

మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మంత్రి రోజా స్నేహితురాలు ..హీరోయిన్ రమ్యకృష్ణ స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడినందుకు బండారు సత్యనారాయణని క్షమించకూడదన్నారు. మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని.. అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు రమ్యకృష్ణ. సినీ నటీ ఖుష్బు , నవనీత్ కౌర్ స్పందించారు. రాజకీయ నాయకురాలుగా కాకపోయినా ఓ మహిళ గా తను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉందని తెలిపారు. బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ.. రోజాకు తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే నటి కుష్బూ, రాధిక, కవిత, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ స్పందిస్తూ.. రోజాకు మద్దతు తెలిపారు.

Tags:
Next Story
Share it