CM Jagan : జగన్, విజయసాయిలకు సిబిఐ కోర్టులో ఊరట

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్, విజయ సాయి రెడ్డి లకు సిబిఐ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు

CM Jagan : జగన్, విజయసాయిలకు సిబిఐ కోర్టులో ఊరట
X

CM Jagan : ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్, విజయ సాయి రెడ్డి లకు సిబిఐ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది సిబిఐ కోర్టు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు ఫ్యామిలీ వెకేషన్ నిమిత్తం యుకే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు నెల రోజుల పాటు విజయ సాయి రెడ్డికి విదేశీ టూర్ కు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు.

టూర్ కు అనుమతి ఇవ్వద్దని సిబిఐ వాదనను తోసి పుచ్చిన సిబిఐ కోర్టు.. ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్, విజయ సాయి రెడ్డి లకు ఊరట కల్పించింది. ఇది ఇలా ఉండగా, రేపు సుప్రీంకోర్టులో ఆర్ ఫై జోన్ కేసు పై విచారణ జరుగనుంది. ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణాల పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ఏపి ప్రభుత్వం. రాజధాని పరిధిలోని ఆర్ 5 జోన్లో నిర్మాణాలు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ఏపి ప్రభుత్వం.

Tags:
Next Story
Share it