Cm Jagan: ఇవాళ్టి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే

సిద్ధం సభలతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టించిన సీఎం వైయస్ జగన్

Cm Jagan: ఇవాళ్టి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే
X

ఎన్నికల లక్ష్యంగా మరో ప్రచారాస్త్రం

*సీఎం వైయస్ జగన్ సారధ్యంలో మేమంతా సిద్ధం*

*నేడు మొదటి రోజు బస్సు యాత్ర సాగేదిలా*

సిద్ధం సభలతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టించిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో నిర్వహించిన సిద్ధం సభల ద్వారా రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏపాటిదో చూపించడమే కాకుండా కార్యకర్తలు, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు.

ఎన్నికలకు సిద్ధం అని వాళ్ళతో అనిపించడమే కాకుండా అందరం ఎన్నికలకు ఉరుకుందాం అనే కిక్కును తీసుకొచ్చారు. ఇప్పుడు *"మేమంతా సిద్ధం"* *అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించారు.

ఇందులో భాగంగా మర్చి 27 న ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఆ తరువాత వేంపల్లె, విఎన్ పల్లె, పోట్లాడుట్టి మీదుగా పొద్దుటూరు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఆ తరువాత ఆళ్ళ గడ్డ చేరుకొని అక్కడే బస చేస్తారు.. ఈ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి కార్యకర్తలు, ప్రజలు... విద్యార్థులు.. యువత.. మహిళలు, రైతులు.. కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతారు.. వారితో ముచ్చటించి ప్రభుత్వ పాలనా గురించి వారి అభిప్రాయాలూ తెలుసుకుంటారు. ఎక్కడికక్కడ స్థానికులతో మాట్లాడుతూ... వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు. అత్యంత ప్రజాదరణ ఉన్న వైయస్ జగన్ మళ్ళీ ప్రజల్లోకి వస్తుండడం పట్ల క్యాడర్లో, సాధారణ జనంలో ఆసక్తి నెలకొంది. సిద్ధం సభలను మించి ఈ బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు.

తమ అభిమాన నాయకుడిని కలవాలని, మాట్లాడాలని ఫోటోలు దిగాలని ఎదురుచూసే యువత, విద్యార్థులు... మహిళలు తమ వీలును బట్టి సీఎంను కలుస్తారు. జగన్ మామయ్యా అంటూ వచ్చే విద్యార్థులు దగ్గర్నుంచి రైతుభరోసా వచ్చిందన్న సంతోషాన్ని జగనన్నతో పంచుకోవాలని చూసే రైతన్నలవరకూ ఎంతో మంది ఇప్పుడు తమ ఆత్మీయ నాయకుడిని కలిసేందుకు ఈ యాత్ర ఒక గొప్ప వేదిక కానుంది.ఈ యాత్ర సైతం రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం ఆవుతుందని, పార్టీని విజయతీరాలకు చేర్చడానికి ఈ యాత్ర బాగా తోడ్పడుతుందని క్యాడర్ కూడా విశ్వాసంతో ఉంది.*

Next Story
Share it