Cm Jagan : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సూత్రదారి, పాత్రదారి చంద్రబాబే !

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో సూత్రదారి, పాత్రదారి చంద్రబాబే అంటూ ఏపీ సీఎం జగన్‌

Cm Jagan : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సూత్రదారి, పాత్రదారి చంద్రబాబే !
X

Cm Jagan : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో సూత్రదారి, పాత్రదారి చంద్రబాబే అంటూ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. కాసేపటి క్రితమే... వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం నిధులను రిలీజ్‌ చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... 3,57,844 మంది కాపు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.536.77 కోట్లు రిలీజ్‌ చేస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. DBT ద్వారా రూ.2 లక్షల 36వేల కోట్లు ఇచ్చామని... వీటిలో కాపు అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.22,333 కోట్లు పేర్కొన్నారు.

Non - DBT ద్వారా కాపు అక్కచెల్లెమ్మలకు రూ.16,914 కోట్లు ఇచ్చిమని వివరించారు సీఎం జగన్. అవినీతి కేసులో అరెస్టయన మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెప్తా.. ఆలోచించండంటూ...చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సీఎం జగన్‌. ఇన్ని దొంగ తనలు చేసినా, ఎన్ని వెన్నుపోటు పొడిచిన చంద్ర బాబును రక్షించుకునేందుకు దొంగలా ముఠా ఉంది.. కానీ చట్టం ఎవరికైనా ఒక్కటే అంటూ పవన్‌ కళ్యాణ్, బాలయ్యలకు కౌంటర్‌ ఇచ్చాడు. సామాన్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో....అదే శిక్ష రాజకీయ నాయకులకు అదే వర్తిస్తుంది అని చెప్పే వాళ్ళు చంద్ర బాబుకు లేరన్నారు సీఎం జగన్‌.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ప్రత్యేకతలు

Tags:
Next Story
Share it