Cm Jagan :నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

మరో యాత్రకు సిద్ధం..అయ్యారు సీఎం జగన్. నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల ప్రచార భేరికి ఇడుపులపాయలో శ్రీకారం చుడతా

Cm Jagan :నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర
X

Memanta Siddham Yatra: మరో యాత్రకు సిద్ధం..అయ్యారు సీఎం జగన్. నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల ప్రచార భేరికి ఇడుపులపాయలో శ్రీకారం చుడతారు సీఎం జగన్. తొలి రోజు కడప పార్లమెంట్‌ పరిధిలో నిర్వహణ ఉంటుంది. వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా జగన్ యాత్ర కొనసాగనుంది. అటు ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్... అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకోనున్నారు.

రాత్రికి అక్కడే శిబిరంలోనే బస చేయనున్న సీఎం జగన్‌.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనించనున్నారు. నిత్యం ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో సీఎం జగన్‌ బస్సు యాత్ర ఉంటుంది.రోజూ ఉదయం వివిధ వర్గాలతో మమేకం.. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరణ చేస్తారు సీఎం జగన్. సాయంత్రం పూట ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు ఉంటాయి.

Tags:
Next Story
Share it