Jagananna Thodu Scheme : చిరు వ్యాపారులకు నేడు ‘జగనన్న తోడు’

ఏపీ (AP) ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వాళ్ళ కాళ్ళ మీద వారిని నిలబెడుతూ ఒక్కొక్కరికి ఏపీ

Jagananna Thodu Scheme : చిరు వ్యాపారులకు నేడు ‘జగనన్న తోడు’
X

Jagananna Thodu Scheme : ఏపీ (AP) ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వాళ్ళ కాళ్ళ మీద వారిని నిలబెడుతూ ఒక్కొక్కరికి ఏపీ సర్కారు ఏటా రూ. 10,000 రుణంగా అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సకాలంలో ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి రూ. 10,000కు ఆదనంగా ఏటా రూ. 1,000 చొప్పున కలుపుతూ వస్తున్న ప్రభుత్వం....ప్రస్తుతం రూ. 13 వేల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తోంది.

కాగా ఇవాళ వరుసగా 8వ విడత.. "జగనన్న తోడు" (Jagananna Thodu Scheme) నిధులు విడుదల చేయనుంది ఏపీ సర్కార్‌. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్...ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం అందిస్తారు. ఈ తరుణంలోనే.. 3,95,000 చిరు వ్యాపారులకు లబ్ది చేకూరనుంది. వీరికి 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు ఇస్తారు. మొత్తంగా రూ. 431.58 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్నారు సీఎం జగన్ (cm jagan).

Tags:
Next Story
Share it