Pithapuram : పిఠాపురం లో జనసేన కార్యకర్తలకు ఘోర అవమానం!

నిన్న పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నిన్న సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు ప్రారంభం కావాల్సిన సభ, రాత్రి 8 గంటలకు మొదలైంది.

Pithapuram : పిఠాపురం లో జనసేన కార్యకర్తలకు ఘోర అవమానం!
X

న్యూస్ లైన్, పిఠాపురం: నిన్న పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నిన్న సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు ప్రారంభం కావాల్సిన సభ, రాత్రి 8 గంటలకు మొదలైంది. ఇదంతా పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి తంగెళ్ల ఉదయ్ వల్లనే అని అక్కడి జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ముందుగా వారాహి బండి కి అనుమతి తీసుకోకపోవడం వల్ల అంత ఆలస్యం అయ్యిందని, ఉదయ్ పని తీరు ఆ రేంజ్ లో ఉంది అంటూ జనసేన కార్యకర్తలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. అంతే కాకుండా నేడు పిఠాపురం లో ఉదయ్ కారణంగా జనసేన కార్యకర్తలకు తీవ్రమైన అవమానం కలిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర మండుటెండలో రెండు గంటల పడిగాపులు కాసారు కార్యకర్తలు.

కానీ వారిని లోపాలకి రానివ్వకుండా పవన్ కళ్యాణ్ బౌన్సర్లు గేట్ వేసేసారు. దీంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు పార్టీ కోసం సేవ చేసిన తమను వెధవల్ని చేశారని తన ఆవేదనను వాట్సప్ గ్రూపులో షేర్ చేసారు. నేడు పవన్ కళ్యాణ్ వార్డు కమిటీ సభ్యులతో సమావేశం అవ్వాల్సి ఉండగా, అది కూడా ఉదయ్ కారణం చేతనే రద్దు అయ్యిందని మండిపడుతున్నారు. పిఠాపురం కు ఏవరేవరో వస్తున్నారు..వారిని భుజం మీద పెట్టుకుని మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా పక్కన పెడితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ప్రస్తుత ఇంచార్జి వర్మ ని కూడా పవన్ కళ్యాణ్ బౌన్సర్లు అడ్డుకోవడంతో టీడీపీ నాయకులూ గేట్లు తోసుకొని లోపలకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా జనసేన ఇంచార్జి ఉదయ్ వల్లనే జరిగిందని కార్యకర్తలు మండిపడుతున్నారు.

Tags:
Next Story
Share it