Tdpjanasena : CAA ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ - జనసేన మీద పడనుందా?

కేంద్రం లో బీజేపీ పార్టీ తీసుకునే నిర్ణయాలు విప్లవాత్మక ధోరణిలోనే ఉంటాయి. ఇది వరకు ఎన్నో నిర్ణయాలు అలాంటివి మనం చూసాము. వాటి వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదురుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం(CAA) కూడా అలాంటిదే.

Tdpjanasena : CAA ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ - జనసేన మీద పడనుందా?
X

న్యూస్ లైన్, అమరావతి : కేంద్రం లో బీజేపీ పార్టీ తీసుకునే నిర్ణయాలు విప్లవాత్మక ధోరణిలోనే ఉంటాయి. ఇది వరకు ఎన్నో నిర్ణయాలు అలాంటివి మనం చూసాము. వాటి వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదురుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం(CAA) కూడా అలాంటిదే. ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తే 2014 డిసెంబర్ 31 తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఏర్పడుతుంది. అలాగే అలా అక్రమంగా చొరబడిన ముస్లిమ్స్ కి మాత్రం పౌరసత్వం లభించదు. ఈ చట్టంపై ముస్లిమ్స్ లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మొదటి నుండి బీజేపీ పార్టీ కి హిందూ పక్షపాతి అనే పేరుంది.

ఈ చట్టం తో అది మరింత దృడంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై కూడా బలంగా పడే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూటమి లోకి రావడం వల్ల అద్భుతాలు జరిగిపోతాయి అని గుడ్డిగా నమ్మి, ఆ పార్టీ ని బలవంతంగా పొత్తులోకి తీసుకొచ్చి తనకి ఇచ్చిన 24 స్థానాల్లో కూడా మూడు స్థానాలు బీజేపీ కి త్యాగం చేసి త్యాగాల త్యాగరాజు అనిపించుకున్న పవన్ కళ్యాణ్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ చట్టం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లిం మైనారిటీల ఓట్లు కూటమి పడే అవకాశాలు పూర్తిగా పోయాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది జగన్ ఓటింగ్ శాతం పెంచే విధంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Tags:
Next Story
Share it