Janasena : 70 ఎమ్యెల్యే స్థానాలపై జనసేన గురి..భారీగా చేరికలు!

అందరు అనుకుంటున్నట్టుగా జనసేన ఎదో 25 సీట్స్ లేదా 30 సీట్స్ లో పోటీ చెయ్యడం లేదు, ఏకంగా 70 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ సతాగ్ని అధికారికంగా ప్రకటించింది.

Janasena : 70 ఎమ్యెల్యే స్థానాలపై జనసేన గురి..భారీగా చేరికలు!
X

Newsline, Mangalagiri : టీడీపీ జనసేన పార్టీలు ఈసారి కలిసి పోటీ చెయ్యబోతున్నాయి అని అధికారిక ప్రకటన చేసినప్పటి నుండి ఇరు పార్టీలకు సంబంధించి కార్యకర్తల్లో ఎన్నో సందేహాలు, అపోహలు, వాటి వల్ల సోషల్ మీడియా లో ఇరు వర్గాల మధ్య బీభత్సమైన గొడవలు. గడిచిన కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో జరుగుతున్నవి ఇవే. పొత్తుకు తూట్లు పొడిచే జనసేన కార్యకర్త అయినా, టీడీపీ కార్యకర్త అయినా, వాళ్ళను మేము వైసీపీ కోవర్టులుగా భావిస్తామని అటు పక్క పవన్ కళ్యాణ్,ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పలు సందర్భాలలో భారీరంగంగానే తెలిపారు. కానీ అభిమానులు మాత్రం సమన్వయం పాటించట్లేదు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వారు అయితే జనసేన కి కేవలం 22 సీట్లు మాత్రమే టీడీపీ ఇస్తుందని,అంతకు మించి ఎన్ని సీట్లు ఇచ్చినా కూటమి ఓడిపోతుందని, ఇలా నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం ప్రారంభించారు.

అలా కామెంట్ చేసిన ప్రతీ ఒక్కరికి దిమ్మ తిరిగే ట్విస్ట్ నేడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. అందరు అనుకుంటున్నట్టుగా జనసేన ఎదో 25 సీట్స్ లేదా 30 సీట్స్ లో పోటీ చెయ్యడం లేదు, ఏకంగా 70 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ సతాగ్ని అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాలను సమీక్షించాడని, అందులో నుండి 70 స్థానాలపై ఆయన గురి పెట్టాడని, త్వరలోనే జనసేన పార్టీ లో భారీ గా చేరికలు జరగబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ సమక్ష్యం లో వైజాగ్ వైసీపీ ఎంఎల్సీ వంశీ కృష్ణ జనసేన పార్టీ లో చేరారు. వైసీపీ కి వైజాగ్ లో ఆయువుపట్టులాగా నిలిచినా వంశీ కృష్ణ ఇప్పుడు జనసేన లో చేరడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆయన మాత్రమే కాదు జనవరి నెలలో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లీడర్స్ జనసేన లోకి వస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలిపాడు.

Tags:
Next Story
Share it