Janasena : మచిలీపట్టణం లోక్ సభ అభ్యర్థిని ప్రకటించిన జనసేన!

బీజేపీ, తెలుగు దేశం పార్టీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో 21 ఎమ్మెల్యే స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

Janasena : మచిలీపట్టణం లోక్ సభ అభ్యర్థిని ప్రకటించిన జనసేన!
X

న్యూస్ లైన్, మచిలీపట్టణం: బీజేపీ, తెలుగు దేశం పార్టీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో 21 ఎమ్మెల్యే స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 18 ఎమ్మెల్యేలను, ఒక ఎంపీ ని అధికారికంగా ప్రకటించారు. ఇక నేడు మచిలీపట్టణం నుండి జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరి పోటీ చేయబోతున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. వల్లభనేని బాలసౌరి వైసీపీ పార్టీ నుండి జనసేన లో ఈమధ్య కాలం లోనే చేరారు. ఆయనకీ ఎంపీ స్థానం దాదాపుగా ఖరారు అయ్యినప్పటికీ సర్వేలు చేయించి, ఒకవేళ బాలసౌరి కి అనుకూలంగా లేకపోతే నాగబాబు ని మచిలీపట్టణం ఎంపీ గా పోటీ చేయించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు గతం లో వార్తలు వినిపించాయి. అయితే సర్వే ఫలితాలు బాలసౌరి కి అనుకూలంగా రావడంతో అతని పేరుని నేడు అధికారికంగా ప్రకటించారు. ఇంకా మూడు ఎమ్మెల్యే స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అవనిగడ్డ స్థానం నుండి ఎక్కువ ఆశావహులు ఉండడంతో ప్రస్తుతానికి సర్వేలు చేయిస్తున్నారు అట. అలాగే విశాఖపట్నం సౌత్ నుండి వంశీ కృష్ణ యాదవ్ దాదాపుగా ఖరారు అయ్యినట్టే. పాలకొండ స్థానం కి కూడా ఏప్రిల్ 3 వ తారీఖు లోపు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags:
Next Story
Share it