Pithapuram : పిఠాపురంలో జనసేన పార్టీకి పెద్ద షాక్!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానం నుండి పోటీ చెయ్యబోతుండడం తో రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు పిఠాపురం చుట్టూనే తిరుగుతున్నాయి.

Pithapuram : పిఠాపురంలో జనసేన పార్టీకి పెద్ద షాక్!
X

న్యూస్ లైన్, పిఠాపురం : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానం నుండి పోటీ చెయ్యబోతుండడం తో రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు పిఠాపురం చుట్టూనే తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు అధికార పార్టీ వైసీపీ అన్నీ విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని స్వయంగా పవన్ కల్యాణే నిన్న జరిగిన ఒక సమావేశం లో చెప్పుకొని రావడం విశేషం. దీనికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వంగా గీత కూడా చాలా దీటుగా సమాధానం ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే గత ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన మాకినీడు శేషు కుమారి నేడు జనసేన పార్టీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కోసం కష్టపడినా తనని ఇంచార్జి పదవి నుండి తప్పించి ఉదయ్ కుమార్ కి ఇవ్వడం పై ఆమె తప్పు బట్టింది. అంతే కాకుండా పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు, వంగ గీత ని గెలిపేంచేందుకు సాధ్యమైనంత తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.

Tags:
Next Story
Share it