Janasena : రాజమండ్రి సీటు నాదే..గోరంట్ల నోరు అదుపులో పెట్టుకోవాలి - కందుల దుర్గేష్

టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకం విషయం లో ఏర్పడిన గందరగోళం పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని రాజమండ్రి రూరల్ స్థానం విషయం లో టీడీపీ , జనసేన పార్టీ నాయకుల మధ్య పెరిగిన మాట యుద్ధం ని చూస్తే అర్థం అవుతుంది. గత రెండు రోజుల క్రితం టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరీ రాజమండ్రి రూరల్ సీట్ నుండి తాను పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. దీనిపై జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ మండిపడ్డాడు.

Janasena : రాజమండ్రి సీటు నాదే..గోరంట్ల నోరు అదుపులో పెట్టుకోవాలి - కందుల దుర్గేష్
X

న్యూస్ లైన్, రాజమండ్రి : టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకం విషయం లో ఏర్పడిన గందరగోళం పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని రాజమండ్రి రూరల్ స్థానం విషయం లో టీడీపీ , జనసేన పార్టీ నాయకుల మధ్య పెరిగిన మాట యుద్ధం ని చూస్తే అర్థం అవుతుంది. గత రెండు రోజుల క్రితం టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరీ రాజమండ్రి రూరల్ సీట్ నుండి తాను పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. దీనిపై జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ మండిపడ్డాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ 'ఏ సీటు ఎవరికీ దక్కుతుంది అనేది చంద్ర బాబు , పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటిస్తారు. అప్పటి వరకు ఎవరికీ తోచినట్టు వాళ్ళు సీటు మాకే అంటూ విర్రవీగిపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అలా మాట్లాడడం సరికాదు, నోరు అదుపులో పెట్టుకోవాలి. నాలుగు రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాజమండ్రి రూరల్ సీట్ నీదే అని తెలిపారు. కచ్చితంగా రాజమండ్రి రూరల్ సీట్ నాదే అనే బలమైన నమ్మకం తో ఉన్నాను' అంటూ చెప్పుకొచ్చారు కందుల దుర్గేష్.

ఇంకా ఆయన మాట్లాడుతూ 'రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలతో నాకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది, నా అభ్యర్థిత్వం నిజాయితీ తో కూడుకున్నది, గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ బలమైన స్థానాలను కోరుకుంటుంది, రాజమండ్రి జనసేన కి కంచుకోట లాంటిది, ఆ స్థానం ని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గతం లో టీడీపి అధినేత చంద్రబాబు సీట్లు ప్రకటించినప్పుడు పొత్తులు ఊసు లేదు, ఆ తర్వాతే టీడీపి, జనసేన పొత్తుల కుదిరాయి, అందువల్ల పొత్తు ధర్మంలో కొన్ని సీట్లను జనసేన కోరడం సహజం' అంటూ ఈ సందర్భంగా కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it