jd laxmi narayana : వైసీపీలోకి జేడీ.. వార్తల పై క్లారిటీ..

వైసీపీ(ycp) పార్టీలో చేరబోతున్నారనే పుకార్ల పై సీబీఐ(cbi) మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మి నారాయణ(laxmi narayana) స్పందించారు. తాను వైసీపీలో చేరతానన్న వార్తల పై నిజం లేదని తెలిపారు.

jd laxmi narayana : వైసీపీలోకి జేడీ.. వార్తల పై క్లారిటీ..
X

న్యూస్ లైన్, డెస్క్ : వైసీపీ(ycp) పార్టీలో చేరబోతున్నారనే పుకార్ల పై సీబీఐ(cbi) మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మి నారాయణ(laxmi narayana) స్పందించారు. తాను వైసీపీలో చేరతానన్న వార్తల పై నిజం లేదని తెలిపారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే తన పోరుబాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.

“శ్రీశైలం(srisailam) ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశాను. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదు... ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే నా పోరుబాటకు కట్టుబడి ఉన్నాను” అని జేడీ లక్ష్మి నారాయణ చెప్పారు.

Tags:
Next Story
Share it