Ka Paul : పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి ప్లాన్ నా దగ్గరుంది

పవన్ కళ్యాణ్ (pawan kalyan) సీఎం అవ్వడానికి ప్లాన్ నా దగ్గరుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (Ka Paul). జనసేనాని పవన్‌ను

Ka Paul : పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి ప్లాన్ నా దగ్గరుంది
X

Ka Paul : పవన్ కళ్యాణ్ (pawan kalyan) సీఎం అవ్వడానికి ప్లాన్ నా దగ్గరుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (Ka Paul). జనసేనాని పవన్‌ను కలిసేందుకు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. అరగంట పాటు వేచి చూసిన తర్వాత పవన్‌ను కలిసేందుకు అనుమతి లేదని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడారు.

తమ్ముడు పవన్ (pawan kalyan) ముఖ్య మంత్రి అయితే బాగుంటుంది. అందుకోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది పవన్‌కు చెబుదామని వచ్చా అని పాల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరానని...ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ (Ka Paul). కోవిడ్ (covid 19) వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరమన్నారు. కాపులందరూ బయటకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. నా ఆరోగ్యం బాగానే ఉంది.. నా మీద విష ప్రయోగం చేసిన దేవుని కృపతో వైద్యుల సహాయంతో బయటపడ్డానని తెలిపారు. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని తెలిపారు ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ (Ka Paul).

Tags:
Next Story
Share it