TDP : చంద్రబాబు పై కాకినాడ టీడీపీ శ్రేణుల ఆగ్రహం!

రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పొత్తు అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, అవసరమైతే త్యాగాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. పొత్తులో నిజమైన బంధం ఉంది అనే అనుభూతి ఇరు పార్టీల క్యాడర్స్ కి అనిపించినప్పుడు ఓటు బదిలీ అవ్వడం వంటివి జరుగుతుంది. కానీ టీడీపీ - జనసేన పార్టీల మధ్య ఇదే ఇప్పుడు కొరవడింది.

TDP : చంద్రబాబు పై కాకినాడ టీడీపీ శ్రేణుల ఆగ్రహం!
X

న్యూస్ లైన్, కాకినాడ : రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పొత్తు అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, అవసరమైతే త్యాగాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. పొత్తులో నిజమైన బంధం ఉంది అనే అనుభూతి ఇరు పార్టీల క్యాడర్స్ కి అనిపించినప్పుడు ఓటు బదిలీ అవ్వడం వంటివి జరుగుతుంది. కానీ టీడీపీ - జనసేన పార్టీల మధ్య ఇదే ఇప్పుడు కొరవడింది. రెండు పార్టీలలో జనసేన పార్టీ త్యాగాలకు సిద్దంగానే ఉంది కానీ, టీడీపీ పార్టీ మాత్రం త్యాగాలకు అసలు సిద్ధం గా లేదు. అసలే జనసేన పార్టీ శ్రేణులు తమ పార్టీ కి కేవలం 24 స్థానాలే దక్కాయి అని బాధపడుతున్నారు.

వాస్తవానికి 2019 ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ కోస్తాంధ్రలో చాలా బలపడింది. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ కంటే బలమైన పార్టీ అనే చెప్పాలి. అలాంటి పార్టీ కి కేవలం 24 సీట్లు ఇవ్వడం అనేది అన్యాయం అని పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు సైతం బాధపడున్నారు. ఆ 24 స్థానాలకు కూడా తూట్లు వెయ్యడానికి తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తుంది. ఉదాహరణకి కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేన పార్టీ కి చెందిన పంతం నానాజీ కి కేటాయించారు. ఈ స్థానం పంతం నానాజీ కి కేటాయించడం పై తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన అసహనం నెలకొంది. ఈ స్థానం ఎట్టి పరిస్థితిలోను తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అనంత లక్ష్మి కి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసారు. తెలుగు దేశం పార్టీ ఫ్లెక్సీలను చింపి చంద్రబాబు నాయుడు కి నిరసన గా నినాదాలు చేసారు.

Tags:
Next Story
Share it