Kodali Nani : దమ్ముంటే నాతో పోటీ చెయ్యి అంటూ చంద్రబాబు కి కొడాలి నాని సవాల్!

ఆంధ్ర ప్రదేశ్ లో మే 13 న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఈ నేపథ్యం లో రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టేశాయి.

Kodali Nani : దమ్ముంటే నాతో పోటీ చెయ్యి అంటూ చంద్రబాబు కి కొడాలి నాని సవాల్!
X

న్యూస్ లైన్, గుడివాడ: ఆంధ్ర ప్రదేశ్ లో మే 13 న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఈ నేపథ్యం లో రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టేశాయి. నేడు సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పేరు తో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగా, రేపటి నుండి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు.లగే ఈ నెల 30 వ తారీఖు నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం పిఠాపురం నుండి మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యం లో కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ 'దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ గుడివాడ లో వచ్చి నాపై పోటీ చెయ్యాలి. నన్ను ఓడించడం ఎలాగో అర్థం కాక గుడివాడ లో రోజుకో అభ్యర్థిని ప్రకటిస్తున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఎక్కడో అమెరికా నుండి మరో అభ్యర్థిని ప్రకటించాడు. ఎంత ప్రయత్నం చేసిన నన్ను ఓడించడం అనేది అసాధ్యం. ఐదవసారి గుడివాడ ఎమ్మెల్యే గా గెలవబోతున్నాను' అంటూ చెప్పుకొచ్చారు కొడాలి నాని.

Tags:
Next Story
Share it