Amaravati : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాసుందా?-కొడాలి నాని

గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం ని సీఎం జగన్ తాకట్టు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ఈ సందర్భంలో ఆ పార్టీ కి సంబంధించిన కోడలి నాని స్పందించారు.

Amaravati : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాసుందా?-కొడాలి నాని
X

న్యూస్ లైన్, అమరావతి : గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం ని సీఎం జగన్ తాకట్టు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ఈ సందర్భంలో ఆ పార్టీ కి సంబంధించిన కోడలి నాని స్పందించారు. ఆయన మాట్లాడుతూ ' ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకోవచ్చు. ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఎక్కడైనా రాజ్యాంగం లో రాసుందా ?, నేడు మన రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉంటే, అందులో రెండున్నర లక్షల కోట్లు బాబు చేసినవే. సచివాలయం ఏమైనా అద్భుతమైన కట్టడమా?, కేవలం పది ఎకరాల ఆస్తి మాత్రమే, 350 కోట్ల రూపాయిలు కూడా ఉండదు, ఏమాత్రానికే ఇంత హంగామా అవసరమా, ప్రజల సంక్షేమ పథకాల కోసం ఒక్కోసారి ఇలా చెయ్యక తప్పదు, ఊరికినే ఏ బ్యాంక్ కూడా రుణం ఇచ్చేయదు కదా' అంటూ కొడాలి నాని చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it