TDP : టీడీపీ పార్టీ లో చేరిన కొలికపూడి..మండిపడుతున్న వైసీపీ!

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తున్న ఈ నేపథ్యం లో రాజకీయ పార్టీలలో చేరికలు జోరు అందుకున్నాయి. రీసెంట్ గా తెలుగు దేశం పార్టీ లోకి కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు , అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు చంద్రబాబు సమక్షం లో నిన్న పార్టీ లో చేరారు.

TDP : టీడీపీ పార్టీ లో చేరిన కొలికపూడి..మండిపడుతున్న వైసీపీ!
X

న్యూస్ లైన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తున్న ఈ నేపథ్యం లో రాజకీయ పార్టీలలో చేరికలు జోరు అందుకున్నాయి. రీసెంట్ గా తెలుగు దేశం పార్టీ లోకి కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు , అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు చంద్రబాబు సమక్షం లో నిన్న పార్టీ లో చేరారు. చంద్రబాబు వీళ్లిద్దరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించాడు. ఇది ఇలా ఉండగా అమరావతి రైతుల పక్షాన పోరాడుతూ, ఎన్నో ఉద్యమాలు చేసిన కొలికిపూడి టీడీపీ లో చేరడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ నాయకులు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'ఎట్టకేలకు ముసుకు తొలగించి టీడీపీ కండువా కప్పేసుకున్న ముసుగు మేధావి కొలికపూడి' అంటూ సోషల్ మీడియా లో విమర్శల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు ఈ మేధావి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నాడని మేము చెప్తే మీరు నమ్మలేదు, ఇప్పుడు చూడండి అంటూ వైసీపీ పార్టీ నాయకులు సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు.

Tags:
Next Story
Share it